Revanth Reddy: బీఆర్‌ఎస్ సభ్యులు అహంభావంతో వ్యవహరిస్తున్నారు..! 2 d ago
TG : ప్రతిపక్షం సహనం కోల్పోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్ సభ్యులు అహంభావంతో వ్యవహరిస్తున్నారన్నారు. మర్యాద లేకుండా స్పీకర్‌పైనే పేపర్లు విసిరేశారని మండిపడ్డారు. చర్యలు తీసుకునే పరిస్థితులు వచ్చినా.. స్పీకర్ ఓపికతో వ్యవహరించారని అన్నారు. భూముల కోసం ఎంతో మంది యోధులు త్యాగాలు చేశారన్నారు. అధికారం, అహంకారంతో.. కొంతమంది ఆధిపత్యం కోసం దాడులు చేశారని సీఎం చెప్పారు. భూమి కోసం, భుక్తి కోసం సాయుధ పోరాటం చేశారని వెల్లడించారు. భూమి కోసం సకల జనులు పోరాడిన సందర్భాలు ఉన్నాయన్నారు. చట్టాలతో యజమానుల హక్కులను కాపాడుకుంటూ వస్తున్నామని తెలిపారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్‌ను పీవీ తీసుకొచ్చారని, ఇందిరా హయాంలో అసైన్‌మెంట్ భూముల పంపిణీ జరిగిందని పేర్కొన్నారు. యూపీఏ హయాంలో భూభారతి పేరుతో దేశవ్యాప్తంగా సంస్కరణలకు శ్రీకారం చుట్టారని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.